చరిత్ర ప్రకారం నందికొట్కూరు   చుట్టు ఉన్న 9 నందులు ఉండటం వలన నందికొట్కూరు ప్రాంతాన్ని "నవనందికొట్కూరు" గా పిలిచేవారు. నందికొట్కూరు ప్రాంతాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించినారు. నందికొట్కూరు కర్నూలు జిల్లలో ఒక ముఖ్యమైన పట్టణం. ఈ ప్రాంతం మంచి వాణిజ్య కేంద్రంగా  వెలసిల్లింది. ఈ ప్రాంతాన్ని కర్నూలుకు 27 కి.మీ.ల దూరంలో కర్నూలు నుంచి గుంటూరు రహదారిలో మరియు విజయవాడ, శ్రీశైలం పోవు రహదారుల యందు నందికొట్కూరు ఉన్నది. ఈ నందికొట్కూరు ప్రాంతంలో కే.సి కెనాల్ ప్రవహించి కొన్ని వందల ఎకరాల భూములు సాగుకు తోడ్పడుతుంది. ఈ ప్రాంతం ముఖ్యంగా  వరి పంటకు అనుకూలమైనది. మన భారతదేశంలోనే ఈ ప్రాంతంలో పండిన వరికి  ( సోన మసూరి ) మంచి గిరాకి ఉంది. ఈ ప్రాంతంలో వేరుశనగ. మొక్కజొన్న, జొన్న, ప్రొద్దుతిరుగుడు, ప్రత్తి, కందులు, శనగలు, పొగాకు మొదలగు వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో నాపరాయి గనులకు ప్రసిద్ది. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో నాపరాయి అధికంగా లభించును.  

                              నందికొట్కూరు గ్రామ ఆవిర్భావము 

13వ శతాబ్దమునకు పూర్వము ప్రస్తుతము గ్రామము ఉన్న ప్రాంతము దట్టమైన అడవులతో నిండి ఉండెడిది. కాకతీయ ప్రభువు శ్రీ ప్రతాపరుద్రుడు తన సైన్యముతో శ్రీశైలమును  సందర్శించుటకు వెళుతూ కొంతసేపు ఇచ్చట సేద తీర్చుకొనుటకు విడిది చేయుచుండేడివాడు. రాజు కోరికపై సిరిసంగడు అను సేన సామంతుడు ఈ ప్రాంతమున శైవ సంప్రదాయముగా గ్రామమును ఏర్పాటు చేసినట్లు, ప్రస్తుతము ఉన్న కోట ప్రాంతము, పురాతన శైవ, వీరభద్ర, సూర్య నారాయణ ఆలయాలు, శిధిలమైన కోట బురుజులు చుట్టూ కందములు, శిలాశాసనముల పరిశీలనను బట్టి తేలియున్నది. గ్రామము చుట్టూ 9 నంది విగ్రహములు స్థాపించి వాటి మద్య వెలసిన గ్రామము కావున నవనందికొట్కూరు గా పిలవబడుచు కాలక్రమమున నందికొట్కూరు  గా రూపాంతరం చెందినట్లుగా తెలియుచున్నది. చరిత్ర ప్రకారం 11వ శతాబ్దంలో నందికొట్కూరు ప్రాంతం పశ్చిమ చాళుక్యులు పరిపాలనలో ఉండేది. ఆ తర్వాత నందుల పాలనలో ఈ ప్రాంతం ఉండేది. దానికి సాక్షాలుగా ఈ చుట్టూ ప్రక్కల ప్రాంతాల పేర్లు నవనందికొట్కూరు, నంద్యాల, నందవరం, మహానంది సాక్షాలు.

క్రీ.శ. 323 శతాబ్దం లో చంద్రగుప్త మౌర్యుడు అతని కుమారుడు బిందు సాలుడు
ఈ ప్రాంతాన్ని పరిపాలించారని పత్తికొండ దగ్గర ఉన్న జొన్నగిరి శాసనం ద్వార తెలియుచున్నది.  ఈ కాలంలో ఈ ప్రాంతాన్ని సువర్నగిరి అని పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని శాతవాహన రాజులు పరిపాలిచినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. దీనికి ఆధారంగా శాతనకోట గ్రామం అని చెప్పవచ్చును. వీరి తర్వాత పల్లవులు, పశ్చిమ చాళుక్యులు, తెలుగు చోళులు, రాష్ట్ర కూటములు, కళ్యాణి చాళుక్యులు, వెలనాటి  చోళులు, యాదవులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు పరిపాలించారు. 1800 సం . లో కర్నూల్ జిల్లా ప్రాంతం మొత్తం బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. 1800 నుండి 1807 సం. వరకు థామస్ మందరో            ఈ ప్రాంతానికి కలెక్టర్ గా వ్యవహరించారు.
Nandikotkur History English Version Click Here
www.nandikotkur.com
Nandikotkur.com